ఫార్ములా-ఈ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ వేసిన పిటీషన్ విచారణలో భాగంగా ఇవ్వాళ హైకోర్టులో జడ్జిగారు వేసిన ప్రశ్నలకు రేవంత్ సర్కారు తరఫు లాయరు సరైన జవాబులు చెప్పలేక ఇబ్బంది పడ్డారు.
అసలు అవినీతే జరగని కేసులో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన రేవంత్ సర్కారు దాన్ని సమర్ధించుకోవడానికి నానాతిప్పలూ పడుతోంది
హైకోర్టులో వాదోపవాదాల సందర్భంగా ఎంతసేపూ ఒకటి రెండు ప్రొసీజర్లు ఫాలో కాలేదనే వాదనే తప్పితే ఎక్కడా అవినీతి జరిగింది అనే మాటను కూడా వాడని ప్రభుత్వ తరఫు లాయర్.
వెరసి ఈ కేసులో డొల్లతనం హైకోర్టు సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన ఈ కేసులో కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయం!
Post Views: 29