*ప్రజలలో బిఆర్ఎస్ కు పెరుగుతున్న ఆదరణ చూసే అక్రమ అరెస్టులు*
*పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసే నాయకులను అక్రమారస్తులు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్నారని ముందస్తు అరెస్టులు చేశారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికలొచ్చినా ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి తిరుకొల్లూరి రాము, గడ్డం వీరన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు గంగాధరి ప్రమోద్ ఉన్నారు
Post Views: 131