+91 95819 05907

బీసీ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం

**

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక టీటీడీసీ భవన్లో జరిగిన బీసీ సదస్సుకు తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వారితో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ కూడా హాజరయ్యారు . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండ్ అని ఎక్కువ జనాభా కలిగి వెనుకబడినటువంటి బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా , సామాజికంగా , రాజకీయంగా , అభివృద్ధి చెందటానికి బీసీ రిజర్వేషన్ అనేది దోహదపడుతుందని అన్నారు . భారత రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కానీ మెజారిటీగా ఉన్న వర్గాలు సామాజిక ఆర్థిక రంగాలలో పేర్కొని పోయిన అసమానతల కారణంగా ఇప్పటికీ చట్టసభల్లో పాలనలో న్యాయ సమ్మతమైన ప్రాతినిధ్యాన్ని పొందలేకపోయారని ఈ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను రాజ్యాంగం పాలకులకు ఇచ్చిందని గుర్తు చేశారు . కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు . సమావేశ అనంతరం భూదాన్ భూమిని పరిశీలించటం జరిగింది . భూదాన్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు . సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు అనేది స్వేచ్ఛ హక్కు అని ఆ హక్కును హరించే అధికారం ఎవరికి లేదని ప్రభుత్వ అధికారులు భూదాన్ బాధితులను సమాచారం లేకుండా అకస్మాత్తుగా ఖాళీ చేయించడం అనేది సరైనది కాదని భూదాన్ బాధితుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో కలిసి చర్చిస్తానని భూదాన్ బాధితులకు హామీ ఇచ్చారు . భూధాన్ సమస్యపై కలసి వచ్చే శక్తులను మరియు బాధితులను కలుపుకొని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ భూధాన్ సమస్యపై విధి విధానాలను సేకరించిన తర్వాత అందరూ కలిసి ముఖ్యమంత్రి ని కలిసి మెమొరండం ఇద్దామని ఆ కమిటీ బాధ్యతలను జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సర్దార్ హుస్సేన్ , ప్రధాన కార్యదర్శి జంగిపల్లి రవి , ముందుండి ఈ సమస్యపై పోరాడి భూదాన్ బాధితులకు అండగా ఉండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షులు కూరపాటి రంగరాజు , తెలంగాణ జన సమితి చిర్ర రవి , పార్టీ సీనియర్ నాయకులు నూనె భాస్కరరావు , ఫీట్ల స్వర్ణకుమార్ , షేక్ మహబూబ్ పాషా, కళాకారులు గాయకులు షేక్ ఫకృద్దీన్ , పమ్మి రవి , అడ్వకేట్ నజీమా , లోడంగి సత్యనారాయణ , నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్ , దేవల్ల నాగేశ్వరరావు , బీసీ ఫెడరేషన్ కులాల రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాషా , సంతోష్ , ముల్లంగి పద్మ, లక్ష్మణాచారి , జానీ బేగం , పోలూరి రాము , బీసీ సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల బీసీ నాయకులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీసీ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం

** నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక టీటీడీసీ భవన్లో జరిగిన బీసీ సదస్సుకు

Read More »

దివ్వఖురాన్‌ సర్వమానవాళికి మార్గదర్శకం: (జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదిక్ అహ్మద్)

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : సర్వమానవాళి మార్గదర్శకత్వం కోసం దివ్వగ్రంధమైన దివ్వఖురాన్‌ రంజాన్‌నెలలో అవతరించిందని జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదిక్ అహ్మద్ అన్నారు. స్దానిక కార్యలయంలో నగర అధ్యక్షులు జైనుల్

Read More »

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత రేవంత్ సర్కార్‌ది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. * ఖమ్మంలో గడ్డపార రాజ్యం.. అర్ధరాత్రి పూట అమానుషంగా పేదల గెంటివేత! *

Read More »

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ముప్పిడి సాంబయ్య లొంగుబాటు

మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్రనేత ఛత్తీస్ గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణాలోని హన్మకొండ జిల్లా

Read More »

ముమ్మరంగా సామాజిక, ఆర్థిక సర్వే : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూములలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతుందని

Read More »

భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి

భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి ______ వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి నేటి గదర్ న్యూస్, ఖమ్మం :

Read More »

 Don't Miss this News !