హైదరాబాద్:ఫిబ్రవరి 04
శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి,ఈరోజు కులసర్వే నివేదిక ప్రవేశ పెట్టారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని అసెంబ్లీలో ప్రకటించారు.
సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం అయ్యాయి.
ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసిన ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ప్రకటన
3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ సిఫారసు
ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించిన వర్గీకరణ కమిషన్
ఎస్సీ కులాలను గ్రూప్- 1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు
మొత్తం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్‌ను 3 గ్రూపులకు పంచుతూ సిఫారసు
గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్-1లోని 15 ఎస్సీ ఉపకులాల జనాభా- 3.288 శాతం
గ్రూప్-2 లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్- 2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా- 62.748 శాతం
గ్రూప్-3 లోని 26 ఎస్సీ ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్- 3లోని 26 ఎస్సీ ఉపకులాల జనాభా- 33.963 శాతం రిజర్వేషన్ సిఫారస్.