+91 95819 05907

త్యాగమూర్తి మాత రమాబాయి మహిళలకు ఆదర్శమూర్తి :మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. మాత రమాబాయి అంబేద్కర్ మహిళలకు ఆదర్శమూర్తి అని మహిళ ప్రాంగణపు అధికారి వేల్పుల విజేత కొనియాడారు. శుక్రవారం వీరనారీమణుల ఆశయ సాధన సమితి కార్యాలయ ఆవరణలో మాత రమాబాయి జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో  మాత రమాబాయి జయంతిని పురస్కరించుకొని , ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రమాబాయి సేవలను కొనియాడారు. మాత రమాబాయి తో పాటు ఇతర వీర నారి మణుల  చిత్రపటాలకు కూడా  పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేత మాట్లాడుతూ తన భర్త డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా  మారే ప్రక్రియలో నిరంతరం ప్రోత్సాహం అందించిన రమాబాయి ధన్యజీవురాలని పేర్కొన్నారు. తన జీవితంలో అత్యధిక సంతానాన్ని కోల్పోయిన , నిరంతరం పేదరికం అనుభవిస్తూ కూడా తన భర్త అంబేద్కర్ ఉన్నతికి అనుక్షణం పాటుపడిన రమాబాయి జీవితం నుండి మనం ఎంతో పూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. వీరనారీమణుల ఆశయ సాధన  సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ సీఐ పొల్లూరు  నాగయ్య , తెలంగాణ ఉద్యమకారుడు పాలకుర్తి కృష్ణ , వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , లీగల్ అడ్వైజర్ షేక్. నజీమా , జిల్లా ఉపాధ్యక్షురాలు త్రివేణి , కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కృష్ణవేణి నాయకులు విజయ ,ఝాన్సీ ,నాగమణి ,నాగేంద్ర, సంధ్య ,సుభద్ర ,భవాని, కవిత , సుశీల, లక్ష్మి ,లలిత ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు రవీంద్ర నాయక్ ,అఖిల్, రామ్మూర్తి, నాగేశ్వరావు ,సంజీవరావు, జగదీష్ , గాయకుడు  ఫక్రుద్దీన్ , రావుల వెంకట్ , ప్రకాష్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !