◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా
◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
-మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం గ్రామంలో కనకం కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం వనపర్తి మోహన్ రావు నివాసంలో స్థానిక ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని. అధికారంలోకి రావాలనే ఆశతో అడ్డగోలుగా హామీలిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక హామీలను గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారని, ఏ క్షణం ఎవరి సీటు పోతుందో అనే భయంతో ప్రజలను, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతి ఒకరు దోచుకునే, దాచుకునే పనిలో ఉన్నారని, ప్రజల్లో వ్యతిరేకత ఉనందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సైతం వెనకడుగు వేస్తున్నారని. రాబోయే రోజుల్లో ఏ నిమిషమైన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక తప్పదని, ఆ సమయంలో నాయకులు, కార్యకర్తలు అందరు సమన్వయంతో పని చేస్తూ ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలని. నేడు కష్టంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అదే స్థాయిలో గౌరవం దక్కే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జూరి వెంకన్న బాబు, మోహన్ రెడ్డి, చిన్న సత్యనారాయణ, తాండ్ర యుగంధర్, కూరపాటి నరేష్, మిండ శ్రీనివాస్ రావు, కొర్సా ప్రతాప్, పొట్టా రాము, వనం బాబురావు, యాసం శ్రీను, తాటి వెంకప్ప, సింగీరాల నాగేంద్ర, రత్కకర్, కొనకళ్ళ శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.