పినపాక ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై ఖమ్మం వెళ్లిన రామకృష్ణను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తాసిల్దార్ అద్దంకి నరేష్, పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు , ఏపీఓ వీరభద్రస్వామి ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆయన మండలంలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. అధికారులందరూ ఆయన తో గల అనుబంధాన్ని, అతను అందించిన సేవల గురించి కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఎంపీడీవో రామకృష్ణ మాట్లాడుతూ మండల ప్రజల సహకారం మరువలేదని అన్నారు. అధికారులకు బదిలీలు సర్వసాధారణం అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24