రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామద్యోగ్ వికాస్ యోజన 2024 -25 క్రింద ఖాది మరియు గ్రామీణ పారిశ్రామిక కమిషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఎస్టీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఎస్టి మహిళలకు ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 6 నుండి 25 వరకు 20 మంది మహిళలతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణకు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో మహిళలకు భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ పూర్తయిన మహిళలకు 3000 రూపాయల స్టయిఫండ్ తో పాటు కుట్టు మిషన్ కిట్టు కూడా అందజేస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు రుణాలు తీసుకోని కుట్టు మిషన్ షాపులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో న్యాక్ ఇన్చార్జి నిజాముద్దీన్,డేమాన్ స్టేటర్ ఐలయ్య,రామకృష్ణ చారి, శిక్షకురాలు భక్తమాల పాల్గొన్నారు.
