నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి17:- తెలంగాణలో బీసీ లకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం.
ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మోడేపల్లి కృష్ణమాచారి,
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ CM రేవంత్ రెడ్డికి కి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి,మద్దతు తెలిపిన పార్టీలకు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపన కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడేపల్లి కృష్ణమాచారి, మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేదుకు పోరాటం చేస్తున్న అన్ని బిసిల సమిష్టి విజయమని బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారి అందరికీ ఇది గర్వకారణం అని అన్నారు, ఈబిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అని, ఇది దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయం,నిలుస్తుంది అని అన్నారు,తెలంగాణ ప్రభుత్వం బీసీల పట్ల తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీసుకోవాలని,దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా,సహకరించాలని మోడేపల్లి కృష్ణమాచారి కోరారు.
