నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
✍️KDR,9581905907
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: విద్యార్థినిలకు తక్షణమే స్కూటీలు ఇవ్వాలని శాసన మండలి ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత,BRS ఎమ్మెల్సీ లు ఆర్ మధు సుదన చారి, మహ్మద్ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, కవిత కల్వకుంట్ల, తాత మధు సుధన్ లు స్కూటీల ప్ల కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రే ను స్కూటీ కహా హై అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ గారు ఇచ్చిన విద్యార్థినులకు స్కూటీ హామీ ఏమైంది కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ గారు ఇచ్చిన విద్యార్థినులకు స్కూటీ హామీ ఏమైంది అంటూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని… హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ అమలు అయ్యేంతవరకు ప్రధాన ప్రతిపక్షంగా బి.ఆర్.ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుందని అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని లేదన్నారు.