+91 95819 05907

వ్యోమగాములు సునీటా విలియమ్స్ మరియు బారీ విల్మోర్ తిరిగి భూమిపైకి వచ్చారు,

నేటి గదర్ వెబ్ డెస్క్:
గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి వచ్చారు… ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్-9 రాకెట్.. క్రూ డ్రాగన్‌‌ను ఆదివారం ఐఎస్ఎస్‌కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని నలుగురు వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు.
భూమికి క్షేమంగా చేరిన సునీతా విలియమ్స్.. ప్రపంచవ్యాప్తంగా హర్షం
గత 9 నెలలుగా ఐఎస్ఎస్‌లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు మార్చి 13 గురువారం క్రూ-10 మిషన్‌ (Crew-10 mission) ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, చివరి నిమిషంలో సాంకేతికలోపంతో ఆ ప్రయోగం ఆగిపోయింది. ఫాల్కన్ రాకెట్ -9 హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో నిలిచిపోయింది. అయితే, లోపాన్ని సరిచేసి.. రెండు రోజుల్లోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. చివరకు మార్చి 15న ఐఎస్ఎస్‌కు డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణం కావడంతో సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం అయ్యింది.
గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి వచ్చారు.. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్-9 రాకెట్.. క్రూ డ్రాగన్‌‌ను ఆదివారం ఐఎస్ఎస్‌కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని నలుగురు వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు.

◆ అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ కాప్సూల్ భూవాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకుంది. అక్కడ నుంచి గంటకు 116 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది.భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచ్యూట్‌లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. నాలుగు పారాచ్యూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్‌ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది కాప్సూల్‌ వద్దకు చేరుకుని దానిని వెలికి తీసి… అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్‌లో జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌తో పాటు నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్‌కు చెందిన గోర్బునోవ్‌లు భూమికి చేరుకున్నారు. డ్రాగన్ కాప్సూల్‌కి నిక్ హేగ్ కమాండర్‌గా వ్యవహరించారు.గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలని భారత్‌లోని ఆమె సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బంధువులు యజ్ఞ‌ం, పూజలు నిర్వహించారు. సునీతా విలియమ్స్‌ పూర్వీకులు ఝూలాసన్‌లో ఉంటున్నారు. ఆమె రాకపై సునీతా సోదరుడు దినేష్ రావల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

sorce:తొలి సమయం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తప్పిన ప్రమాదం…అదుపుతప్పి భారీ లారీ….

నేటి గదర్ న్యూస్, మణుగూరు మండలం రూరల్ : మణుగూరు మండలం రామానుజరం గ్రామ సమీపంలో,R&B రహదారిలో అదుపుతప్పి భారీ లారీ రోడ్డుపక్క గుంతలో పడింది. బ్రేకులు పడకపోవడం తో ఆ భారి వాహనం

Read More »

ఓ.సి 2 సైట్ దగ్గర ఉన్న బి యస్ ఎన్ ఎల్ సెల్ టవర్ సిగ్నల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి :నాగెళ్లి

★ ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెళ్లి నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్: మణుగూరు సింగరేణి ఏరియా కొత్తగా ఏర్పాటు చేసిన ఓ సి 2 సైట్ అఫీస్

Read More »

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌!

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌! 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న టాక్‌ వినిపిస్తోంది.

Read More »

నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్న గోవిందరాజు జాతర…పెద్ద ఎత్తున హాజరుకానున్న ★సనప★ వంశీయులు

*పెద్ద ఎత్తున హాజరుకానున్న సనప వంశీయులు* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*, నేటి నుండి మూడు రోజులపాటు పెద్ద ఎత్తున గోవిందరాజు జాతర జరగనుంది. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో సనప వారి ఇలవేల్పు

Read More »

కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి

భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది

Read More »

నేడే తెలంగాణ బడ్జెట్….

*……. నేడే భట్టి బడ్జెట్ ……* నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…. ఉదయం 9.30 గంటలకు

Read More »

 Don't Miss this News !