నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
* పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించిన వాటిపై చర్యలు చేపట్టారా..?
* మొబైల్ వెటర్నరీ యూనిట్ల వివరాలేంటి..?
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం: దేశవ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ లో రోగ నిర్ధారణకు మెరుగైన లేబొరేటరీ సౌకర్యాలు ఉన్నాయా..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించిన లోటుపాట్లపై బ్లాక్ లేదా జిల్లా స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని అడిగారు. దీనికి కేంద్ర పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల సహాయ మంత్రి ఎస్ పీ. సింగ్ బఘోల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ప్రయోగశాలలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రాలలో డయాగ్నస్టిక్ సెంటర్లు కలవని తెలిపారు.
* రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం(ఎల్ హెచ్ డీ సీపీ) వెటర్నరీ లాబొరేటరీల స్థాపన, బలోపేతం కోసం మద్దతిస్తున్నట్లు తెలిపారు.
* రైతుల ఇంటి వద్దే జీవాలకు రోగనిర్ధారణ, చికిత్స అందించేందుకు మొబైల్ వెటర్నరీ యూనిట్లు (ఎంవీయూఎస్) దేశవ్యాప్తంగా 4,016 పనిచేస్తున్నాయని అన్నారు.
* ఇక తెలంగాణకు సంబంధించి వెటర్నరీ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలు, ప్రథమ చికిత్స, మొబైల్ డిస్ప్లేన్సర్లకు సంబంధించి మొత్తం 2,117 ఉన్నట్లు వివరించారు.