◆గెజిట్ ప్రకారమే ప్రతి నెల 26 వేల వేతనం ఇవ్వాలి
●ఆశ్రమ పాఠశాల పనిచేసే డైలీ వేజ్ వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి
●డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మద్దతు :భూక్యా వీరభద్రం
నేటి గదర్ ప్రతినిధి, వైరా:
రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు వేతనాలు తగ్గించే జీవో 64 ను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి గెజెడ్ ప్రకారమే కనీసం 26 వేల రూపాయలు వేతనం చెల్లించి డైలీ వేజ్ వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘం(TGS ) జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గతంలో 26 వేల రూపాయలు వేతనం ఇచ్చేదాన్ని కాదని జిఓ 64 ప్రకారం 11 వేల రూపాయలు వేతనం ఇస్తామంటే ఎలా కుదురుతుంది అని ప్రభుత్వానికి ప్రశ్నించారు. గతంలో రోజుకి 870 రూపాయలు చొప్పున ఇచ్చే వేతనాన్ని ఇప్పుడు రోజుకి 390 కి కుదించడం కార్మికుల శ్రమ దోపిడిని గురి చేయడమే అవుతుందని న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి హాస్టల్ లో పనిచేస్తున్న పేద గిరిజన కార్మికులకు న్యాయం చేసే విధంగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలో ఉన్న డైలీ వేస్ కార్మికులతో కలిసి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే గిరిజన సంక్షేమ శాఖ ఉందని వెంటనే ముఖ్యమంత్రి స్పందించి డైలీ వేజ్ వర్కర్ యూనియన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. గిరిజన శాసనసభ్యులు ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు.