నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతులకు రైతు భీమా ఉన్నట్టా?లేనట్టా?అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం శాసన మండలి లో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఇచ్చే రైతు బీమా బాగాలేదని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. రైతు బీమా స్థానంలో కొత్త ప్రభుత్వం రైతుల కొరకు మెరుగైన స్కీం ఏమైనా తీసుకువస్తుందా? ఈ సంవత్సరం రైతు బీమా ఉన్నట్టా? లేనట్టా ?స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు క్వింటాలు కి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించి నేడు వరి ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడే బోనస్ ఇస్తానని మాట మార్చడం తగదన్నారు. తన ప్రశ్నలకు ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
Post Views: 86