*స్నేహితుడి కుమార్తె వైద్యానికి చిన్ననాటి మిత్రుడు చేయూత
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:స్నేహం
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.ఈ ప్రపంచంలో స్నేహం ఎంతోవిలువైంది మరో నిరూపించారు స్నేహితులు.వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వాపురం మండలం తురుముల గూడెం తండా గ్రామానికి చెందిన తేజావత్ శంకర్ కుమార్తె హరిని అనారోగ్యం తో బాధపడుతోంది. శంకర్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడం కుమార్తె వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ దాతల సహకారం కోరుతున్నారు. తన చిన్ననాటి మిత్రుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీసు ఐటీసెల్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ తన మిత్రుల సహాయంతో రూ. 27,500 సేకరించి తన మిత్రుడి కుమార్తె వైద్య ఖర్చు నిమిత్తం శంకర్ కుటుంబానికి అందించడం జరిగింది.
Post Views: 98