మణుగూరు మున్సిపాలిటీ గ్రామాలను గ్రామపంచాయతీలుగా విభజించండి
* మణుగూరు మున్సిపాలిటీ కావడంతో ఉపాధి హామి పనులు కోల్పోతున్న గ్రామాల ప్రజలు
*19 సంవత్సరాలు గా ఎన్నికలు లేవు
*జీరో అవర్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మణుగూరు మున్సిపాలిటీ 13 పంచాయతీలుగా విభజించాలని అసెంబ్లీ జీరో అవర్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామపంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటివరకు వరకు అంటే సుమారు 19 సంవత్సరాలు గా స్థానిక సంస్థల ఎన్నికలు లేవన్నారు. ఎన్నికలు జరగట్లేదు . ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అయిన తర్వాత కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి దీని వలన ఆ మణుగూరు మున్సిపాలిటీలో అయ్యే సందర్భంలో 13 గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ కూలి చేసుకునే వందల కుటుంబాలను మున్సిపాలిటీలో కలపడం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకొని అర్వ్హత కోల్పోయారు. మున్సిపాలిటీ కావడం వలన గ్రామీణ ఉపాధి పథకాలు అక్కడ వర్తించట్లేదు వ్యవసాయ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలు పనులు చేసుకోవడానికి వచ్చిన చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అందులో అర్వ్హత కోల్పోయిన 13 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా 19 సంవత్సరాల నుంచి ఎన్నికల కూడా జరగట్లేదు .ఇటు ఎన్నికలు లేక వ్యవసాయ పనులు ఇటు వ్యవసాయ కూలీలుగా పని చేసే అవకాశం లేక అదే విధంగా ఇంటి పనులు కట్టలేక వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది మణుగూరు మున్సిపాలిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను 13 గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి వాళ్లకు ఇంటి పనులు తగ్గే విధంగా గ్రామీణ ఉపాధి హామీలో పనులు కల్పించే విధంగా అవకాశం కల్పించాలని కోరడం జరిగింది* *మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో 13 గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామీణ ఉపాధి పథకంలో వారికి వ్యవసాయ కూలీలుగా పని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
