నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మండల పరిధి
భద్రాచలం పట్టణం కేకే ఫంక్షన్ హాల్ లో బుధవారం ఇండస్ట్రియల్ ఏరియా బిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్ము నారాయణ మేస్త్రి కుమారుడు వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయగా, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి జ్ఞాపికను అందజేశారు . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు చింతాడి చిట్టిబాబు, సీనియర్ నాయకులు తాండ్ర వెంకట రమణ, సాయిబాబు, మండల యూత్ అధ్యక్షులు గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 61