+91 95819 05907

అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారికి సివిల్ సప్లై హెచ్చరికలు?!

ఇంటి గ్యాస్ (డొమెస్టిక్ )సిలిండర్ల పై సివిల్ సప్లై నజర్
*రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లు
*రోజుకు 2 లక్షల సిలిండర్ల వినియోగం
* రూ.500 గ్యాస్ పథకం కొరకురాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500కోట్ల పై చిలుకు భారం
*రాష్ట్రంలో అక్రమంగా
కమర్షియల్ గా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మెరుపు దాడులు చేసిస్వాధీనం చేసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
*కేసులు నమోదు చేస్తున్నా ఆ శాఖ
*ఉచిత గ్యాస్ కొరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వివరాలు సేకరిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు
* హోటల్లు, రెస్టారెంట్లు, గ్యాస్ వినియోగించే వ్యాపారాలపై పెరగనున్న దాడులు
* ముందుగానే హెచ్చరిస్తున్న నేటి గదర్ న్యూస్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: మీకు హోటల్ ఉందా… కర్రీ పాయింట్, నూడిల్స్ పాయింట్,రెస్టారెంట్ ఇలా వ్యాపారులు నిర్వహిస్తున్నారా!జాగ్రత్త సుమీ. అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారి పై సివిల్ సప్లై దాడులు జరగనున్నట్లు విశ్వసినీయ సమాచారం . ఇందుకు కారణం ఇదే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గృహలక్ష్మి పథకం కింద రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అర్హులైన మహిళలకి అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీ ల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకాలు అమలు చేశారు.3వ హామి కింద రూ.500 అర్హులైన మహిళలకు గ్యాస్ అందజేయనున్నారు.ఇప్పటికే గ్యాస్ లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో సంబంధిత అధికారులు సైతం లబ్ధిదారుల వివరాలపై ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఈ పథకం అమలు చెయ్యాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపుగా రూ.2500 కోట్ల భారం ప్రతి సంవత్సరం పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పథకం పారదర్శకంగా అమలు కావాలంటే డొమెస్టిక్ గ్యాస్ దుబారాను నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది చిరు వ్యాపారులు, హోటల్లు ,రెస్టారెంట్లు తదితర వాణిజ్య కార్యకలాపాలకు దొడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగించిన సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. రూ.500 కి డొమెస్టిక్ గ్యాస్ ప్రభుత్వం రాయితీపై అందజేయాలి అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. లేనియెడల ప్రభుత్వంపై అధిక భారం పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో సివిల్ సప్లై అధికారులు హోటల్స్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తూ అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు… కేసులు సైతం నమోదు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఆయా వ్యాపారస్తులపై సివిల్ సప్లై అధికారులు మరిన్ని దాడులు చేసే ఆస్కార ఉంది. జాగ్రత్త సుమీ. ఆయా వ్యాపారస్తులకు నేటి గదర్ హెచ్చరిక,సూచన.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !