నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: సమాజాభివృద్ధికి పాటుపడిన సంత్ సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆదర్శమని భద్రాచలం MLA డా.తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం గిరిజన సంక్షేమ హాలులో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా Mla డా. తెల్లం హాజరై సేవలాల్ మహరాజ్ చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల హక్కుల కోసం నీరు, భూమి, అడవి అనే నినాదంతో సంత్ సేవాలాల్ మహరాజ్ పోరాడారన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ ప్రతిక్ జైన్,ఐటీడీఏ ఏపీఓ ,సేవాలాల్ డివిజన్ నాయకులు హరిచంద్ర నాయక్,బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతి రావు,నాయకులు ఆకోజ్ సునీల్ తదితరులు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 67