జర్నలిస్ట్ శంకర్ గౌడ్ పై దాడి .మాజీ మంత్రి స్పందన ఇదే
ప్రశ్నించే జర్నలిస్ట్ పై దాడి, బెదిరించడం నీచమైన చర్య
*ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
*మాజీ మంత్రి తన్నీరు హరీష్ రాయ్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:ప్రశ్నించే జర్నలిస్ట్ ల పై దాడి, బెదిరించడం నీచమైన చర్య అని బీ. ఆర్.ఏస్ నేత,మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడి మరువక ముందే మారో జర్నలిస్ట్ శంకర్ పై గుర్తుతెలియని గూండాల దాడిని తీవ్రంగా ఖండిచారు.ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి, భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అని అన్నారు.ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు ప్రశ్నించే జర్నలిస్ట్ పై దాడి, బెదిరించడం నీచమైన చర్య గా అభివర్ణించారు .ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని,ఇలాంటివి పునరవృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
