*సామాజిక కార్యకర్త కర్నె రవి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుండి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వరకు R&B చేపట్టిన సైడ్ వాల్ నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ శూన్యం అని మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి ఆరోపించారు. శుక్రవారం ఆయన సైడ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బి అధికారులు, కోర్టు స్థలం వద్దకు రాగానే అష్ట వంకర్లు తిరిగి సైడ్ డ్రైనేజీ నాణ్యత లేకుండా ఇష్టంవచ్చినట్టు , సైడ్ వాళ్ళను పక్కకు మళ్లిస్తూ ఎవరి మెప్పు కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందరిదీ ఒక రూటు, మా రూటే సెప *రేటు* అన్న విధంగా మణుగూరు R&B అధికారుల తీరు ఉందని, దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సైడ్ వాల్ నిర్మాణాన్ని పారదర్శకంగా నాణ్యంగా నిర్మించాలని కోరారు.
Post Views: 53