సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడినం;సీఎం రేవంత్ రెడ్డి
* సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం
* ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు
* పేదల ప్రభుత్వం ఏర్పడింది
* ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం
* ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా
* సమ్మక్క జాతరకు 6000 బస్సులు కేటాయించాం
*18 కోట్ల మంది ఆడపడుచులు ఉచితబస్సును సద్వినియోగం చేసుకున్నారు
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల స్ఫూర్తితో 10 సంవత్సరాల అరాచక పాలన పై పోరాటం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్ చేశారు. ఆయనమేడారం లో సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను శుక్రవారంమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు గత పది సంవత్సరాలుగా అంచివేతకు గురయ్యారాన్ని, అలాంటి సందర్భంలో ఎవరో ఒకరు పుడతారని గత పాలన ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష కామెంట్ చేశారు.సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం. మేడారం జాతరకు ప్రభుత్వం 6000 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయడం జరిగిందన్నారు. అలాగే అదనంగా మరో 100 బస్సులు కేటాయించడం జరిగిందని సీఎం తెలిపారు. సమ్మక్క తల్లి స్ఫూర్తితో ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు.పేదల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం.ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సు సర్వీసు సద్వినియోగం చేసుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.
