నేటి గదర్ న్యూస్ , వాజేడు:
మండలం లోని గుమ్మడిదొడ్డి గ్రామంలో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పగూడెం, సుందరయ్య కాలనీ,గ్రామాలలో ప్రజలకు పలు రకాల జ్వరాలు, కీళ్ల నొప్పులు తలనొప్పుతో ఉన్నట్లు గుర్తించారు, జ్వరం తీవ్రత ఎక్కువ ఉన్నవారి దగ్గర నుండి రక్త నమూనాను సేకరించి పరీక్షలు చేశారు.వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ డాక్టర్ కొమరం మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్ఞాన సాగర్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లలిత కుమారి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 439