మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
సమ్మక్క తల్లినీ సాగనంపిన వెంటనే పూజారి మృతి పట్ల పలు అనుమానాలు
నేటి గదర్ న్యూస్ , తాడ్వాయి(వాజేడు ప్రతినిధి): ఆ వనదేవతలను తరతరాలుగా ఆ వంశంవారు కొలుస్తూ అమ్మవారి పూజలోనే తరిస్తూ ఉంటారు. కోట్లాదిమంది భక్తుల కోర్కెలు తీర్చిన ఆ తల్లులు తమను క్షణక్షణం పూజించే భక్తునికి మాత్రం పెద్ద శిక్ష వేశారు. ఆ తల్లులను అడవికి సాగనంపిన కొద్ది సమయానికి సమ్మక్క సారలమ్మ తల్లుల ఆలయ ప్రధాన పూజారి మృతి చెందిన విషయం ములుగు జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. గత సంవత్సరం అక్టోబర్ మా సంలో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ఆలయ ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణరావు మృతి చెందిన విషయం విధితమే. గురువారం అదే వంశానికి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రధాన ఆలయ పూజారి గురువారం ఉదయం మృతి చెందాడు .వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో సిద్ధ బోయిన దశరథం ( 37) సమ్మక్క తల్లి పూజారి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. సిద్ధబోయిన వంశస్తులలో, కుటుంబంలో, మేడారం గ్రామంలో విషాద ఛాయాలనుకున్నాయి. గురువారం వరకు సమ్మక్క సారలమ్మ తల్లుల పూజలు, సంబరాలతో సంతోషంగా గడిచిన ఈ పూజారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు.సమ్మక్క తల్లిని సాగనంపిన వెంటనే పూజారి మృతి పట్ల పలువురు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు.