ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు
జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సైన్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ కార్యక్రమాలతో పాటు, క్విజ్, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించటం జరిగింది. పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ వెంకట్, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మీ నరసయ్యలు సివి రామన్ చిత్రపటాన్ని పూలమాలతో సత్కరించి సైన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల విజ్ఞాన ఆవిష్కరణల ప్రదర్శన, వివరణ ఆసక్తికరంగా సాగింది. అదే విధంగా మండల కేంద్రంలోని సాయి ఎక్స్ లెంట్ స్కూల్, పడమట నర్సాపురంలోని వశిష్ట విద్యా మందిర్ పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలను విద్యార్థులతో కలసి పాఠశాల సిబ్బంది ఘనంగా నిర్వహించారు.