నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ లో బుధవారం జరిగిన ప్రమాదాలతో ప్రజలు వణికి పోతున్నారు. పినపాక మండలం పినపాకలో రెండు ప్రమాదాలు జరగగా, సీతంపేటలో ఓ యువకుడు అతివేగంతో తన ద్వి చక్ర వాహనంతో కారును ఢీకొట్టడంతో కార్ డ్యామేజ్ అయింది.అలాగే పినపాక నుండి సీతంపేట వైపు ఓ యువకు8 తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరో యువకుడు ద్విచక్ర వాహనం పైనుండి ఆదుపుతప్పి కిందపడి గాయాలతో బయటపడ్డాడు
అశ్వాపురం లో నలుగురికి!?
అశ్వాపురం మండలంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భారత్ పెట్రోలియం బంకు సమీపంలో స్కూటీ పల్సర్ మోటార్ సైకిల్ ఢీకొని ముగ్గురి కి గాయాలయాయ్యి. 108 ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొండికుంటలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వారు సైతం గాయాల పాలయ్యారు. బుధవారం ఒక్కరోజు జరిగిన ప్రమాదంలోనే మణుగూరు డివిజన్ లో 10 మంది వరకు గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.