నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు మార్గాన పర్యటించనున్నారు. ఉదయం 9:30 లకు ఖమ్మం జిల్లా కల్లూరు నుండి మంత్రి శ్రీనివాస్ రెడ్డి బయలుదేరి ఉదయం 10:30 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 వరకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెం క్యాంప్ కార్యాలయం చేరుకొని లంచ్, తాత్కాలిక విరామం తీసుకుని మధ్యాహ్నం 4 గంటలకు ఇల్లేందు పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఇల్లందు టౌన్ లోని జేకే గ్రౌండ్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.
