* పోలీసు శాఖ చేస్తున్న జాప్యం కారణంగా ప్రజలకు పోలీసులపై ఉన్న అపారమైన నమ్మకం సన్నగిల్లుతుంది
* భద్రాచలం పోలీసు ఇప్పటిదాకా నిందితులను పట్టుకోకపోవడం అత్యంత ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయి
* దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి
*రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి
*మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి
* లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తాం
* సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండచరణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈనెల 17వ తారీకు గుర్తు తెలియని వ్యక్తలు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం భద్రాచలం పట్టణ కేంద్రం నివాసి అయిన తమ్మల్ల మాణిక్యం అను వృద్ధురాలని అత్యంత పాషవికంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోపిడీ చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి తల పగలగొట్టిన పారిపోయిన ఘటన అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో వైద్యం చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు 24వ తారీఖున మరణించింది నాటి నుంచి నేటి వరకు భద్రాచలం పోలీసు వారు ఈమె మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయలేదు కారణాలు ఏమైనప్పటికీ పోలీసు వారు ఈ ఘటనపై చేస్తున్న జాప్యం వల్ల భద్రాచలం పోలీసులపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం విశ్వాసాన్ని పోలీసు వారు కోల్పోతున్నారు సమాజం పై అవగాహన ఉండి పలుకుబడి ఉన్న విలేకరి కుటుంబంలోని వ్యక్తికే రక్షణ లేదని ఇప్పటివరకు న్యాయం జరగలేదనీ సాధారణ ప్రజలకు ఇంకేమి న్యాయం జరుగుతుందని ఇంకేమీ రక్షణ ఉంటుందని ప్రజలు మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు .అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి వరకు పోలీసు వారు దుండగులను పట్టుకోకపోవడం ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయని అన్నారరు తమ్మల్ల మాణిక్యమ్మ మరణానికి కారణమైన దుండగులను అందరిని అత్యంత కఠినంగా శిక్షించడం ద్వారానే న్యాయం జరుగబడుతుంది
దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి
రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలనీ మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలనీ లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత,ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సందీప్, రాజేష్, మమత, ఈశ్వరి, లోకేష్, నారాయణ, కేశవ్, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు