నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు చలో భద్రాచలం బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసన దీక్ష కార్యక్రమాఎన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ. ….
బిజెపి పార్టీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి చేసింది ఇసుమంతా కూడా లేదు. అటువంటి బిజెపి పార్టీ విజయ సంకల్పయాత్ర అని భద్రాచలం నుండి ప్రారంభించడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అయోధ్య రాముడికి వేలకోట్లు ఖర్చుపెట్టి రామమందిరాన్ని నిర్మించినప్పుడు, భద్రాద్రి రామయ్య ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన ఏమిటి? అయోధ్య రాముడే దేవుడా… భద్రాద్రి రామయ్య దేవుడు కాడా.. అని ప్రశ్నించారు.
Brs పార్టీ అధికారంలో ఉన్నంతకాలం భద్రాద్రి రామయ్య మాయ మాటలు మోసపూరితమైన మాటలు తో కూడిన హామీలు ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు, తెలంగాణలో శ్రీరాముని ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బొంద పెట్టారో , అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శ్రీరాముని ఆశీస్సులతో బిజెపి ప్రభుత్వాన్ని బొంద పెట్టడం కూడా ఖాయం అని తెలియజేశారు.
బిజెపి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే భద్రాచలన్ని వెంటనే టెంపుల్ సిటీగా ప్రకటించాలి.
భద్రాచలం 2000 కోట్లతో అభివృద్ధి చేయాలి.
సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి.
నాలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న భద్రాచలంలో తిరుపతిలో మాదిరిగా svims మాదిరిగా భద్రాచలంలో కూడా Aiims ఏర్పాటు చేయాలి.
అని తెలియజేశారు….
నిజాయితీకి నిలువెత్తు రూపం రామయ్యకు అండగా నిలిచిన నాయకుడు **పొదేం వీరన్న** మరన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు… భద్రాద్రి అభివృద్ధి దొంగ మాటలు చెప్పే బిజెపి బీఆర్ఎస్ పార్టీలతో కాదు నికార్సైన కాంగ్రెస్ నాయకుడు వీరన్న మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తరుణ్ మిత్ర జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పసుపులేటి వీరబాబు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, యువ నాయకుడు సిరాజ్ , టిజె శివ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, సత్తిరెడ్డి , కాంగ్రెస్ నాయకుడు దాసరి సాంబ, తదితర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
