*టీ.టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందా మధు డిమాండ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: కరకగూడెం మండలం చిరు మల్ల గ్రామపంచాయతీ కొంగల చెరువు గండి పడే ప్రమాద పరిస్థితిలో ఉందని టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందా మధు అన్నారు.ఆయన శుక్రవారం పలువురు రైతులతో కలిసి కొంగల చెరువును తూము ను పరిశీలించారు.గత వర్షాకాలంలో తూముల దగ్గర పెద్ద పెద్ద రంధ్రాలు పడి నీరు వృధా గా పోవడం జరిగింది రైతులు పండించిన పంట చేతికందే టైంలో చెరువులో నీళ్లు లేనందువల్ల పంటలు ఎండిపోవడం జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు.చెరువు పారకం తో ఆధారపడి రైతులు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో పంట నష్టపోవడం జరిగిందన్నారు. ఈ వేసవిలో ముందస్తుగా చెరువుకు మరమ్మత్తులు నిర్వహించాలని పై పోత తో పాటు తూములు నిర్మాణం చెయ్యాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో రైతులు చందా వెంకటనారాయణ రామకృష్ణ బాబురావు వెంకటయ్య జగపతి పాల్గొన్నారు.
