+91 95819 05907

TS: పీ ఎం ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌లోకి తిరిగి తెలంగాణ‌

రైతుల‌కు ద‌న్నుగా నిల‌వ‌డ‌మే ధ్యేయం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:

రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్ర‌తికూల‌త‌లు త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్ష‌ణగా నిలిచేందుకు ‘ప్ర‌ధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ (పీఎంఎఫ్‌బీవై)లో రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి చేరింది.

రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ రితేష్ చౌహాన్ ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉప సంహ‌రించుకున్న తీరుపై చ‌ర్చ జ‌రిగింది.
పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగిచేర‌డంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని తెలిపారు.
స‌మావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌ఘునంద‌న్‌రావు, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ శ్రీ గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !