– ఏజెన్సీలో ఉద్యోగాలలో అరుదైన రికార్డు.
* గ్రామానికి పేరు తెచ్చినందుకు గ్రామస్థుల అభినందనలు.
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఒక్క ఉద్యోగం కోసం అనేకమంది విద్యార్థులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల పాటు కోచింగ్ లు తీసుకున్న ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఈ కాలంలో నెలకొంది. ఒక్క ఉద్యోగం వస్తే చాలు జీవితాంతం తన కుటుంబం భరోసాతో బతుకుతుందని ఆశతో అనేకమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. కాని ఒకే సారి నాలుగు ఉద్యోగాలు(జూనియర్ లెక్చరర్, టీజిటీ -ఇంగ్లీష్, టీజిటీ – మ్యాస్, పిజీటీ – ఇంగ్లీష్) వచ్చాయంటే నమ్మశక్యంగా అనిపించదు. అదికూడా ఏజెన్సీ ప్రాంతంలో కూలీ పని చేసే ఇంట్లో ఆడబిడ్డకు ఇటువంటి అరుదైన అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం రమాదేవి చదువుతున్న సమయంలో తండ్రిని కోల్పోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును విడవకుండా పట్టుదలతో, అకుంటితదీక్షతో తన చదువును కొనసాగించింది. భద్రాచలం ఏజెన్సీ బి ఎడ్ పూర్తి చేసుకొని ఉద్యోగమే లక్ష్యంగా చదువుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో పిజి మరియు
జె ఎల్ లు ఏకకాలంలో ఉద్యోగాలు సాధించింది.
ఒకేసారి రమాదేవి నాలుగు ఉద్యోగాలు రావడంతో గ్రామ ప్రజలు ఆమెను అభినందించారు.
– కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్ అభినందన.
ఇష్టపడి చదివితే ఎవరైనా ఉద్యోగాలు సాధించవచ్చునని, అందుకు రమాదేవి నిదర్శనమని కూనవరం మాజీ సర్పంచ్ ఎన్నిక ప్రసాద్ అన్నారు. ఆదివాసి బిడ్డను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది అనేక ఉన్నత శిఖరాలు సాధించేందుకు ముందడుగు వేయాలని, ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందిన రమాదేవిని ఆయన అభినందించారు.