+91 95819 05907

DUMMUGUDEM: అంగన్ వాడి కేంద్రాలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వా లి : CITU

**అంగన్ వాడి కేంద్రాలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలని *ICDSప్రాజెక్టు ఆఫీస్ ముందుCITU
ఆద్వర్యలో అంగన్ వాడీటీచర్ల దర్నా
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(దుమ్ముగూడెం):అధిక ఉష్ణోగ్రతల మూలంగా అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపుమేరకు దుమ్మూగూడెం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కమిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారంసిడిపిఓ కార్యాలయంలో సూపర్వైజర్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి
తెలంగాణఅంగన్ వాడిటీచర్స్&హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టునాయకురాళ్ళు కమలాదేవి,లలిత మాట్లాడారు ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పసిపిల్లలు బాలింతలు గర్భినీలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని పెర్కొన్నారు.మార్చి12నుండి
ఒక్కపూటమాత్రమే అంగన్ వాడికేద్రాలను నిర్వహించేందుకు అనుమతించాలని DWOనికోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండల తీవ్రత బాగా ఉంటుంది .సింగరేణి ఓపెవ్ కాస్టు గణులవలన,అన్నీ జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే నెలలో భగభగ మండే ఎండలు ఉంటాయి.మన జిల్లాలో ఉన్న 2060 అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చిన విధంగా మార్చి 12 నుండి ఒక పూట బడి అమలుచేయాలి.
టీచర్స్ హెల్పర్స్ ఒకేసారి మే నెల అంత సెలవులు ఇవ్వాలని . మే నెల అంతా కోవిడ్ కాలంలో ఎలా అయితే టేక్ హోమ్ రేషన్ ఇచ్చి మే నెల అంతా సెలవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మే నెల మొత్తం సెలవు ఇవ్వాలని .తెలంగాణ అంగన్ వాడీటీచర్స్ &హెల్పర్స్ యూనియన్ CITUకోరుతున్నది. పెండింగ్ లో ఉన్న ఒక నెల జీతం, ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులుచెల్లించాలి. బిల్లులు రాక అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు . కావున దయచేసి మన జిల్లాలో ఉన్న ఎండ త్రీవతను గుర్తించి ఒకపూట బడ్డులు ,మే నెల అంతా వేసవి సెలవులు పెండింగ్ లో ఉన్న జీతాలు ,బిల్లులు ఇవ్వాలని కోరారు.ఈక్రింది సమస్యలపై CDPOకార్యలయంలోసూపర్ వైజర్ కి వినతిపత్రం
అందజేశారు.
1)మే నెల అంతా వేసవి సెలవులుఇవ్వాలి.
2)మార్చి12నుండి ఒంటిపూట బడులు ఇవ్వాలి
3)పెండింగ్ లో ఉన్న ఒక నెల జీతం ఇవ్వాలి
4)సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలి
పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు ఇంటిదగ్గలు ఈవెంట్ డబ్బులు ఇవ్వాలి
5)పెండింగ్ లో ఉన్న ఆరోగ్య లక్ష్మి బిల్లులు కిచెన్ వాటిక డబ్బులు ఇవ్వాలి
5)ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన స్టేషనరీ ఇవ్వాలి
అంగన్వాడి కేంద్రాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలి
6)ప్రాజెక్టు మీటింగు సెక్టార్ మీటింగ్లకు వచ్చినప్పుడు టిఐడిఏలు ఇవ్వాలి
ఈదర్నాలో యూనియన్ నాయకురాళ్ళు గజలక్ష్మి,సుశీల ఆదిలక్ష్మి,శీరిష,విజయ,తిరుపతమ్మతదితరలుపాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్. దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర

Read More »

గిరిజన అభ్యుదయ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయండి

★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్…. చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

 Don't Miss this News !