*ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి:
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారికంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.
బంజారా సంప్రదాయ దుస్తువులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ బండర్ కార్యక్రమంలో డాక్టర్ రాంచందర్ నాయక్ పాటు పాలకుర్తి నియోజవర్గ ఇంఛార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బంజారాల మహిళలతో కలసి సాదాసీదాగా వారితో మాట్లాడుతూ కలసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ పాలకుర్తిలో జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు.బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని,గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని,కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15 ను సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని అప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు.మన రాజధాని లో బంజారా భవనం తో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేస్తాం అని ప్రభుత్యం ప్రకటించింది అని డాక్టర్ రాంచందర్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బంజారాలు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.