OU:స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష:పోలీసు ల అరెస్ట్
*ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత..
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
డీఎస్సీలో పీఈటీ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.ఈ సందర్భంగా వారిని ఓయూ పీఎస్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ … తమ న్యాయ సమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిష్కారం చూపెట్టని ప్రభుత్వం తమని అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. ఇది ప్రజాపాలన కాదురా.. దగా పాలన అని విద్యార్థి నాయకులు నినాదాలు చేశారు.
Post Views: 71