+91 95819 05907

CHERLA :. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి
*ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని అర్హులు మరల చేసుకునే అవకాశం
*రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతీ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
*చర్ల మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని , ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేసింది అని మిగిలిన రెండు గ్యారెంటీలో కూడా మరి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని స్పష్టం చేశారు.ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం హర్ష నియమన్నారు.ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం ,మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇతర మంత్రులు సమక్షంలో హైదరాబాద్ లో ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్హులైన గృహం విద్యుత్ వియోగదారులకి మార్చి నెల నుండి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ బిల్లు పథకం అమలు చేయబడుతుందని తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకోగా మిగిలిపోయిన అభ్యర్థుల సైతం ఎవరైనా ఉంటే ఆ ధైర్య పడకుండా తమ అప్లికేషన్లకు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు మీటర్ బిల్లు జత చేసి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. Brs పార్టీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నది అని అన్నారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని ఆయన తెలిపారు
దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని అయినప్పటికీ ఈ పెరిగిన ధరనుంచి సామాన్య మహిళలకు ఊరట కలిగించేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించారు అని అన్నారు 500 కి గ్యాస్ సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు ఎటువంటి ఇబ్బందుల అయినా ఎదుర్కొని ప్రజా పాలన సాగిస్తుందని గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే DSC ద్వారా 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు శుభసూచికం అని అన్నారు.ప్రతీ నెల ఒకటవ తారీకునే జీతాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని, కరకట్ట నిర్మాణం పనులు మొదలుపెట్టి భద్రాచలం వాసుల కష్టాలు తీరుస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భద్రాచలం అభివృద్ధికి ఒక పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి గుర్తు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !