+91 95819 05907

PINAPAKA:దారి తప్పి వచ్చి చావు దెబ్బలు తిన్న గొత్తికోయ?

*దొంగ అనుకోని చితకబాదిన యువకులు!
*పోలీసులకు అప్పగించినవైనం
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: దారి తప్పి వచ్చిన ఓ గొత్తి కోయ వ్యక్తి చావు దెబ్బలు తిన్నాడు. శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాకలో చోటుచే సుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా పినపాక ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం దగ్గర సంచరిస్తూ కనిపించాడు. ఈ క్రమంలో అతను చిన్నపిల్లల కిడ్నాపరా? దొంగ అనే అనుమానంతో కొంతమంది యువకులు ఆ వ్యక్తిని బంధించారు. తెలుగు భాష రాకపోవడంతో అతనిని దొంగగా భావించి కొంతమంది వ్యక్తులు ఆ అపరిచిత వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. అనంతరం ఏడూళ్ల బయ్యారం పోలీసులకు సదరు వ్యక్తిని అప్పగించారు. అతను మాట్లాడే భాష వేషధారణ గమనిస్తే గుత్తి గోయ వ్యక్తి గా తెలియవచ్చింది. చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీస్ బలగాలకు హోరాహోరీగా కాల్పులు జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్న గుత్తి కోయలు ప్రాణాలు అరచేతుల పెట్టుకుని చెల్లా చెదర అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి పినపాక మండలంలో నివసిస్తున్న ఏదో ఒక గొత్తి కోయ గుంపునకు వెళ్లే క్రమంలో ఇలా దెబ్బల పాలైనట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !