+91 95819 05907

AP:తల్లిదండ్రులను కోట్టిన కొడుకు అరెస్ట్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:ఆంద్రప్రదేశ్ రాష్ట్రం
బి.కొత్తకోట మండలం గుంతవారిపల్లెకు చెందిన పెద్దకాము లక్ష్మమ్మ, పెద్దకాము వెంకటరమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు ప్రస్తుతం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలోని అయోధ్యనగర్‌లోని చిన్న కుమారుడు పి.శ్రీనివాసులురెడ్డి వద్ద ఉంటున్నారు.శ్రీనివాసులురెడ్డి స్థానికంగా చేనేత మగ్గం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు సంపాదించిన అయిదు ఎకరాల భూమిని అన్నదమ్ములకు చెరో సగం రాసివ్వాలని నిందితుడు ఇబ్బంది పెడుతున్నాడు. సగం భూమి తన అధీనంలో ఉన్నా రికార్డుల పరంగా తన పేరున రాయించి ఇవ్వాలని కుమారుడు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు.మొదట కట్టెలతో తర్వాత చేతితో కొట్టి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచాడు. దీనిని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బాధితులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కర్నూలు రేంజ్‌ డీఐజీ, ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఇందులో టూటౌన్‌ సీఐ యువరాజ్‌, ఎస్సైలు ఇనయతుల్లా, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !