+91 95819 05907

TS: సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి బహిరంగ లేఖ

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఇటీవలే ప్రారంభించిన గృహ జ్యోతి పథకంలో లక్షలాదిమంది నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు.తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారని,ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. తానివ్వాల ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరుతున్నాను. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారు. మిగతా వారికి నష్టం కలుగుతుంది. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారు. ఇది సరైంది కాదు.
ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తున్నది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నాను. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలి. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుంది. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !