నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఈ నెల 11 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలి ,వాహన పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం అధికారులకు పలు సూచనలు చేశారు . సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భారీ సక్సెస్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు,
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 66