*మాయదారి మావోయిస్టులు తరిమికొడదాం
* ఆదివాసి మహిళాభివృద్ధికి తోడ్పడుదాం
* ప్రజాస్వామ్య పాల్వ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరున వాల్ పోస్టర్లు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: మావోయిస్టులకు వ్యతిరేకంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాస్వామ్య ఆదివాసి సంఘం పేరున వాల్ పోస్టర్లు వేయడం జరిగింది. ప్రధాన రహదారి ముఖ్యమైన సెంటర్లు మారుమూల గ్రామాలలో వీటిని గుర్తు తెలియని వ్యక్తులు వేశారు.
* మావోయిస్టు దళం చెర నుండి మహిళల విముక్తికై పోరాడుదాం
* మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
* దళంలో మహిళలచే వంట పని బ్యాగుల మోత నాయకుల వ్యక్తిగత పనులకు బానిసలుగా చూసే పద్ధతి నందు విముక్తికై పోరాడుదాం
* విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాలను వాడుకుని ప్రగతి సాధిద్దాం
* మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకుని మనమే పాలకులుగా మారుద్దాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంశాలను పేర్కొని దళంలో మహిళా దుర్భరస్థులతో కూడిన ఫోటో, ప్రజాస్వామ్యంలో మహిళా ప్రగతి లతో కూడిన ఫోటోలను ప్రచురించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.