నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఓడ ఎక్కినంక ఓడ మల్లన్న ఓడ దిగినంక బోడ మల్లన్న అనే సామెతల తయారయింది నేటి అన్ని పార్టీల కార్యకర్తల దుస్థితి. రాజకీయాలను ఫ్యాషన్ గా ఎంచుకుని అనేకమంది రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు. తీరా అధికారం చేతుల్లోకి వచ్చాక ముఖ్య కార్యకర్తల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుంది. పార్టీ కోసం అయినా వాళ్లను ఆప్తులను స్నేహితులను వదులుకొని యుద్ధంలో వీర సైనికి వలె తమ తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఎనలేని కృషి చేస్తారు. తీరా ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వెలువడిన నాటి నుండి ఆ కార్యకర్తలు నాయకులు చుట్టు తిరగాల్సిందే. ఇలాంటి పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పార్టీ కోసం కష్టపడ్డ తమను ఆదుకోవాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులకు నా విజ్ఞప్తి… కాంగ్రెస్ జెండా మూసి ఆర్థికంగా వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులలో అధిక ప్రాధాన్యత ఇవ్వండని ఆ పోస్టుల్లో వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వేరే ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోపోమని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పలు సమావేశాలలో నొక్కి చెప్పారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
