బలరాం నాయక్ కే మహబూబాద్ హస్తం టికెట్.
*డా. శంకర్ నాయక్ నిర్ణయం పై సర్వత్ర చర్చ
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న డాక్టర్ శంకర్ నాయక్ కు AICC అధిష్టానం మొండి చేయి ఇచ్చింది. శుక్రవారం లోక్ సభ ఎన్నికల కు సంబంధించి 39 మంది తో తొలి జాబితా ప్రకటించింది. మహబూబ్ నగర్ వంశీ చంద్ రెడ్డి, మహబూబాద్ బలరాం నాయక్,చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి ,నల్గొండ కుందురు రఘు వీర్,జహీరాబాద్ సురేష్ షెట్కార్ పేర్లను ప్రకటించింది. ఇప్పటికే డాక్టర్ శంకర్ నాయక్ మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని మండలాలలో క్యాడర్ తో మమేకమై సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. తనకే అధిష్టానం సీటు కేటాయిస్తుందని గంపెడు ఆశలతో ఉన్న డాక్టర్ శంకర్ కు AICC మొండి చేయి ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు శంకర్ నాయక్ ఏమైనా హామీ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? బలరాం నాయక్ కి సహకరిస్తాడా? అని కాంగ్రెస్ క్యాడర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కక పోవడం పట్ల డాక్టర్ శంకర్ నాయక్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.