*ప్రధాన రహదారిపై బైఠాయించి కాలి బిందెలతో నిరసన
నేటి గద్దర్ వెబ్ డెస్క్:
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లోని పలు గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి నెలకొంది. గత పది రోజులుగా పలు గ్రామాలలో త్రాగునీరు లేక ప్రజల ఇబ్బంది పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం, దోరేపల్లి గ్రామంలో గత పది రోజులుగా తాగునీరు లేక ప్రజలు నాన అవస్థలు పడుతున్నారు.నీటి సమస్య పై గ్రామ ప్రజలు పై అధికారులకు తెలిపిన ప్రయోజనం లేక గ్రామ ప్రజలు ప్రధాన రహదారిపై బైఠాయించి కాలి బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలలు వేసవి కాలంలో రాష్ట్ర ప్రజలు నీళ్ళు లేక అల్లడుతారు.
Post Views: 53