నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ తీవ్ర పద జాలం తో ధూషించారు.అయన మంగళవారం గాంధీ భవన్ లో ఓ ఛానెల్ తో మాట్లాడారు.
యాదాద్రిలో కింద కూర్చోపెట్టిన సిగ్గులేకుండా నేనే కూర్చున్న అంటున్నాడు. భట్టి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడు.
భట్టి మా పార్టీ నాయకుడు కాబట్టి ఉరుకున్నా లేదంటే అట్రాసిటీ కేసు పెట్టేవాడిని.
పేపర్ యాడ్‌లో భట్టి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక్కడి ఫోటోనే వేసుకుంటున్నాడు అంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలి.
జీవో 46 ఖమ్మం బాధితులు కూడా ఉన్నారుగా ఎందుకు రద్దు చెయ్యట్లేదు భట్టి.. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు భట్టి.
అలా దిగజారే కింద కూర్చున్నాడు. నేనే అతని స్థానంలో ఉంటే వాళ్లని లేపి అయిన కూర్చుందును, లేసి అయినా పోదును.
నామినేటెడ్ పదవులు ఒక్క దళితుడికి ఇప్పించలేదు కానీ శాశిస్తున్నా అంటున్నాడు బొంగు శాశిస్తున్నాడు – బక్క జడ్సన్ ఆరోపించారు.
