బ్రెయిన్ డెడ్ అయిన ఫుడ్ డెలివరీ బాయ్
*అవయవ దానం చేసిన తల్లిదండ్రులు
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:హైదరాబాద్
రాజేందర్‌నగర్‌కు చెందిన బిస్వాల్ ప్రభాస్(19) చదువుకుంటూ, పార్ట్‌టైమ్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా మార్చి 14న జరిగిన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కి గురయ్యాడు.
బిస్వాల్ ప్రభాస్ తల్లిదండ్రులు బ్రెయిన్ డెడ్‌కి గురైన తన కొడుకు అవయవాలు దానం చేయడానికి ముందుకు రావడంతో, కాంటినెంటల్ హాస్పిటల్స్ డాక్టర్స్ కాలేయ వ్యాధితో చివరి దశలో ఉన్న రోగికి కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.తను చని పోతూ మరొకరి ప్రాణం నిలిపిన బిస్వాల్ ప్రభాస్ ని దేవుని తో పోల్చారు. అవయవదానం కి అంగీకరించిన బిస్వాల్ ప్రభాస్ తల్లిదండ్రులను పలువురు అభినందించారు.
Post Views: 109