నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:నా అనుభవం లో చూసినా రాజకీయ నాయకుల్లో REGA Kantha Rao బెస్ట్ లీడర్ అని భుర్గంపాహాడ్ మండలం రెడ్డి పాలెం గ్రామానికి చెందిన సీనియర్ NRI వై వి రావు కితాబు ఇచ్చారు.BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ MLA రేగా కాంతారావు గురువారం NRI వై వి రావు ని రెడ్డి పాలెం లోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులు, కరోనా విపత్తులు ప్రజలకు అండగా ఉన్న తీరు, గోదావరి భారీ వరదల విపత్తులో బూర్గంపాడు మండల ప్రజానీకాన్ని ఆదుకున్న తీరు ప్రశంసనీయమని ఇలాంటి ప్రజల కు సేవ చేసే నాయకుడు ఎంతో అవసరం అన్నాడు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ కుర్రీ నాగేశ్వరరావు , మణుగూరు మండల BRS అధ్యక్షులు ముత్యం బాబు ,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,కూనవరం మాజీ సర్పంచ్ ఏ నిక ప్రసాద్ , మాజీ ఎంపీటీసీ రమణ వల్లభనేని, మడి వీర బాబు, భుర్గంపాహాడ్ మండల BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.
