నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్ :
మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం అగపేట గ్రామానికి చెందిన యువ రైతు కొత్త శ్రీశైలం గౌడ్ (48) కు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులతో కలిసి మండు టెండల్లో ట్రాన్స్ఫార్మర్స్ బిగించారు.అదే రోజు సాయంత్రం ఇంటికి చేరుకొని శ్రీశైలం గౌడ్ ఇంట్లో నే సోమసిల్లి పడిపోయాడు. తక్షణమే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ జీడిమెట్ల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. రైతు శ్రీశైలం గౌడ్ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య సుభద్ర ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరితో ఆప్యాయంగా ఉండే కొత్త శ్రీశైలం గౌడ్ అకాల మృతి తో ఆగపేట గ్రామం శోకసముద్రంలో మునిగి తేలింది. మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.