ఎల్ టి ఆర్ చట్టం అధికారుల నిర్లక్ష్యంతో ఉల్లంఘన
1/70 చట్టం నేటికీ అమలుకు నోచుకోని వైనం
ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో వలస గిరిజనేతరులను నివారించాలి.
ఎల్ టి ఆర్, 1/59,1/70 చట్టాలను ధిక్కరిస్తున్న గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు కట్టాలి.
చెరుకూరు గ్రామంలో నిర్మించిన అక్రమ బహులంతస్తులను కూల్చాలి.
నేటి గదర్ వాజేడు
ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా భూ క్రయ విక్రయాలు, అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తులు, అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న, చట్టాన్ని రక్షించవలసిన అధికారులు మౌనం పాటిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములకు రక్షణగా ఎల్ టి ఆర్ చట్టం బ్రిటీష్ కాలం 1916 నుంచి ఉన్నప్పటికీ నేటికీ అమలుకు నోచుకోకపోగా, ఆదివాసి ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతుందనేది వందకి 100% నిజం,
ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అన్నట్లు సంబంధిత అధికారులకు ఆదివాసీల సమస్యలు అంటేనే ఎగిరెగిరి పడుతుంటారు. చట్టం ఆదివాసులది చట్టాన్ని రక్షించవలసింది అధికారులు,
చట్టం ఉల్లంఘన జరుగుతుంటే బాధ్యత వహించవలసిన అధికారులు, మౌనం పాటిస్తున్నారు. ఇది అధికారుల తీరు.
వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు వ్యతిరేకంగా అనేక అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయినా అధికారులు ముడుపులు తీసుకొని గిరిజనేతరుల అడుగులకు మడుగులోత్తుతున్న పరిస్థితులు వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో జరుగుతుందని ఆరోపణలు లేకపోలేదు, ఆదివారం రాత్రి బహుళ అంతస్తు నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆదివాసి సంఘాల నాయకులు తాహాసిల్దార్ కు చేరవాణిలో మాట్లాడి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని రాత్రి 12:30 వరకు నిలుపుదల చేశారు.అనంతరం ఎవరు లేని సమయంలో బహుళ అంతస్తు స్లాబ్ వేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే బహులంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆదివాసి సంఘాల ఆరోపిస్తున్నాయి. వాజేడు మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఐ కు మంగళవారం ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, వినతి పత్రం అందజేసినట్టు ఆదివాసి సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ జిల్లా అధ్యక్షులు పట్టం జనార్ధన్ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు, కుచ్చింటి చిరంజీవి, గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్, పేర్ల మల్లికార్జున్, బంధం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.