◆మా నేతకాని కులం పై అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి మా కులానికి క్షమాపణలు చెప్పాలి.
◆రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షుడు కొండ గొర్ల కోటేష్ డిమాండ్
నేటి గద్దర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ,(మార్చి 25):
గోదావరిఖని ప్రెస్ మీట్ లో నేతకాని కులం పై అనుచిత వాఖ్యాలు చేస్తూ, అధికార పార్టీ బలుపుతో నేతకాని కులాన్ని నీతి, జాతి లేని కులమంటూ, పొగరు పట్టిన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి వాఖ్యాలను ఖండిస్తున్నామని , మా కులాన్ని అవమానించినందుకు అతనిపై కేసు పెట్టి జైల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని జాడి నాగరాజు ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ నేతకాని ఒక ప్రకటనలో తెలిపారు. నేతకాని కులస్థులు తెలంగాణ ఉద్యమం లో ముఖ్య పాత్ర పోషించారని , అందుకే అపట్లో మా కులానికి కెసిఆర్ గారు ఎమ్మెల్యే , ఎంపీ టికెట్లు ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఓయూ జేఏసీ చైర్మన్ గా ముందుండి తెలంగాణ ఉధ్యమాన్ని నడిపించిన దుర్గం భాస్కర్ మా కులం వారని మీకు తెలియదా ?. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న రామటెంకి శ్రీకాంత్ గారిది మా కులం అని నీకు తెలియదా?.
రాష్ట్ర రాజధాని వేదికగా ఉద్యమాల్లో ఓయూ ప్రొఫెసర్ జాడి మురళీధర్ , మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , గోమస శ్రీను, గోగు సుధాకర్ దుర్గం సారయ్య వీళ్లంతా ఉద్యమం లో పాల్గొన్నది మీకు కనపడలేదా, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నది మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఓట్లకు మాత్రమే మా కులాన్ని ఉపయోగించుకుంటూ, పదవులు మాత్రం మీరు అనుభవిస్తున్నారు. ఉద్యమాల్లో అందరం చేసిన మేము మాత్రమే ఉన్నామని ఆర్థిక, రాజకీయ అహంకారం తో, మా కులాన్ని వెనక్కి నెట్టి వేస్తూ, చివరకు మా కులాన్ని అవమానిస్తావా? ఖబడ్దార్ గుమ్మడి కుమార స్వామి మా నేతకాని కులానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి, కరీంనగర్ మహబూబాద్ జిల్లాలలో అత్యధికం గా ఉన్న మా కులస్థులకు ఓటు తో మీకు తగిన బుద్ధి చేపుతామని, మిమ్మలని మా విధుల్లో తిరగనియ్యమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండగొర్ల కోటేష్, జాడి లక్ష్మీనారాయణ, దుర్గం సురేందర్, జాడి సోమయ్య, రామటంకి దామోదర్, జాడి వినయ్ ,జిమ్మిడి పూలమ్మ, జాడి భాగ్యలక్ష్మి, రితీష్, జాడి వినయ్, దుర్గం సురేందర్ ,తదితరులు పాల్గొన్నారు.